EPS 95 Pension

Latest Eps 95 pension today in Telugu

Latest Eps 95 pension today in Telugu:

ఈనెల 27 28వ తేదీలలో జరుగుతున్న సి బి టి మీటింగ్ నిర్ణయాలు గురించి చాలామంది ఈపీఎస్ 95 పెన్షనర్లు ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు.

Please click the Text here to read in English

ముఖ్యంగా నవంబర్ 4వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈపీఎఫ్ తీర్పును అమలు చేసే విషయంలో జాప్యం చేస్తున్నదని పెన్షనర్లు భావిస్తున్నారు.

గత సంవత్సరము ఈపీఎస్ 95 పెన్షనర్లకు వడ్డీ రేటు 8.1%గా నిర్ణయించారు ఈ వడ్డీ రేటు ఈ నాలుగు సంవత్సరముల కాలంలో అతి అల్పమైన వడ్డీ రేటుగా చెబుతున్నారు.

ఇప్పుడు జరగబోవు వడ్డీ రేటు నిర్ణయంపై అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చాలామంది పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు.

ఈమధ్య కాలంలో బ్యాంకులు వడ్డీని కొద్దిగా పెంచినందువలన ఈపీఎఫ్ఓ కూడా వడ్డీలు కొంతవరకు పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

సీనియర్ సిటజన్స్ గ ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లు,

11(3),

11(4),

26(6) ఆప్షన్ ఫోరంలు EPFO పోర్టల్ లో అప్లోడ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని ఆర్గనైజేషన్లు, మధ్యలో మూసి వేయడం వలన ఆ సంస్థలో పనిచేసే రిటైర్ అయిన

ఉద్యోగులు E P F O కోరిన విధంగా పోర్టల్ లో అప్లోడ్ చేయడానికి సాధ్యం కావడం లేదు.

మరి కొంతమంది ఉద్యోగులు 10 సంవత్సరంలో సర్వీస్ తర్వాత మధ్యలో ఉద్యోగము వదిలినందుకు లేక ఉద్యోగం మారినందుకు ఈ ఫారం లను ఎలా అప్లోడ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

మరి కొంతమంది Spouses కూడా ఈ అయ్యర్ పెన్షన్ ఆప్షన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా అని ఇతర పెన్షనర్లను అడుగుతున్నారు.

2014 సంవత్సరమునకు ముందు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అయ్యర్ పెన్షన్ కు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ లేదనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు అయ్యర్ పెన్షన్ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఈపీఎఫ్ఓ కి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలి.

ఇదివరకు అప్లై చేసిన పెన్షనర్లు అమౌంట్ ఎంత కట్టాలి? అనే విషయం ఈపీఎఫ్ఓ సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి.

అదేవిధంగా పెన్షనర్లకు ఇవ్వబోతున్న పెన్షన్ అమౌంటు తెలియజేయాలి.

పెన్షన్ల దగ్గర నుంచి కట్టవలసిన అరియర్స్ వడ్డీతో సహా కట్టవలసి ఉంది కనుక పెన్షనర్లకు రావలసిన పెన్షన్ కూడా వడ్డీతో సహా ఇవ్వాలి.

పెన్షనర్లకు ఇవ్వవలసిన ఎరియర్స్ అమౌంటు EPFO వారు ఎన్ని నెలలు లోపల రిఫండ్ చేస్తారని విషయం తెలియజేయాలి. EPFO ఈ మేరకు circular రూపేణా నమ్మకం కలుగచేయాలి.

న్యాయ సమ్మతమైన మినిమం పెన్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే హ య్యర్ పెన్షన్ యొక్క తీవ్రత, భారము EPFO కు తగ్గుతుంది.

దాదాపు 50 శాతం మంది పెన్షనర్లు హ య్యర్ పెన్షన్ నుంచి విరమించుకుంటారు. ఈ విషయం కనీస తెలివి తేటలున్న ఎవరికైనా అర్థం అవుతుంది.

దీనివలన హయ్యర్ పెన్షన్ భారం ఈపీఎఫ్వోకు ప్రభుత్వానికి చాలావరకు తగ్గుతుంది.

వయసు మళ్ళిన వృద్ధులకు తమ జాయింట్ ఆప్షన్ ఫారం అప్లోడ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక వారికి హెల్ప్ సెంటర్ ఒకటి చేయాలి.
ప్రస్తుతమున్న హెల్ప్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏమాత్రం హయ్యర్ పెన్షన్ విషయంలో ఉపయోగపడటం లేదు.

మరియు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి.


హెల్ప్ లైన్ లో హిందీలో మాత్రమే ఇస్తారు కనుక ప్రాంతాలవారీగా లోకల్ లాంగ్వేజి మాట్లాడడానికి సాధ్యం కావడం లేదు కనుక ఆయా రీజియన్, జోన్ల వారీగా హెల్ప్ సెంటర్లు హైయర్ పెన్షన్ ఆప్షన్ ఫార్మ్స్ అప్లోడ్ విషయంలో ఏర్పాటు చేయడం చాలా అవసరం.

Thanks to the contributors V.C. shyamasundar and ByreddiSurendra Reddy

Tags:

Latest Eps 95 pension today in Telugu

EPFO

pd4193ah

Recent Posts

EPS 95 Pension latest news today

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

23 hours ago

EPS Pensioners to get pension from any bank, any branch, any where in India

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

4 days ago

EPS 95 Minimum Pension

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

5 days ago

EPS 95 Pension latest news today

जावक मेल क्रमांक/ यवत समारंभ/२९२४/२०२४.        दिनांक २सितम्बर२०२४ || प्रेस नोट,यवत ,पुणे ,महाराष्ट्र…

5 days ago

EPS 95 Minimum Pension & Unified Pension System

This post is from the pen of G. Srinivas Rao. "Major Trade Unions not bothered…

7 days ago

EPS 95 Pension latest news today

"जहाँ चाह वहाँ राह। 30 अगस्त, वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के साथ बैठक"…

1 week ago