How to eat a mango Fruit| Best Mango Fruit |Telugu

How to eat a mango Fruit| Best Mango fruit |Telugu

పరిచయం: ముఖ్యంగా మామిడి పండు తినే విధానం ఈ పండులో తెలుసుకుందాము. మీకు తెలియందేమీ కాదు, మన ఎదురుగా ఎవరైనా మామిడి పండు తిన్నా, పచ్చి చింతకాయ తిన్నా, వేంచిన వేరుశనగలు తిన్నా తట్టుకోలేము. అనగా, మనమూ అవి తినవలసిందే! మామిడి పండ్లను ఏ వయసు వారైనా చిన్న,యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఏవరైనా రుచి మరియు ఆరోగ్యం కోసము తినవచ్చును.

How to eat a mango:

మామిడి పండును ఎలా తినాలి అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటున్నాము కదా. మామిడి పండు అత్యంత రుచికరమైన పండు, ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా! అందుకే ఆ పండు గురించి కొన్ని మాటలు……

Best Mango fruit:

ఒక్కో ప్రాంతములో ఒక్కో రకమైన పండును Best Mango fruit గా తలుస్తారు. అయితే తినే పద్దతి తెలియక పోతే మాత్రం Best Mango fruit కూడా worst Mango fruit అవుతుంది. అనగా అది అన్నారోగ్యం పాలు చేస్తుంది. అదెలా అని తెలుసుకోవాలనుందా?, అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

మామిడి పండును ఎలా తినాలి అనే విషయం ఇక మొదలు పెడదాం. ఇది తెలియాలి అంటే, మామిడి పండ్లను ఎలా కోనాలి అనే విషయం తెలియాలి.

మామిడి పండును పండుగా కొనరాదు. వాటిని కాయలుగా కొనాలి.

కొన్న కాయలను తెచ్చి ఇంట్లో ఎండు వరిగడ్డిలో మాగ వేయాలి. అనగా కొద్దిగా వరిగడ్డిని ఒక అట్ట పెట్టలో గాని లేక గూటి లో కానీ లేక ఇంట్లో ఒక మూలన గాని గడ్డిని వేసి అందులో మామిడి కాయలను వేయాలి. ఎండు గడ్డి సులుభంగా దొరుకుతుంది. ఒక వేల గడ్డి లభించక పోయినా, వాటిని అలాగే ఉంచి గాలి తగలకుండగా మూసి ఉంచాలి. ఒక రెండు లేక మూడు రోజుల తరువాత అవి కొన్ని , కొన్ని పండుగా తయారౌతాయి. ఏరోజు తయారైన పండ్లను ఆరోజు కాని లేక మరుసటి రోజు కాని ఆరగించవచ్చును. పండంటే ఇది పండు ఒరిజినల్ పండు. ఇందులో అనారోగ్యం లేదు. ఆరోగ్యం వంద శాతం. ఇలా తయారైన పండ్లు మధురం శాతం ఎక్కువగా ఉంటుంది.

పై విషయము మనసులో ఉంచుకున్న ఒక పెద్దాయన పండ్లు కొనడానికి మార్కెట్టుకు వెళ్ళాడు.

“బాబూ ఈ మామిడి రేటు?” అడిగాడు.

“కిలో వంద రూపాయలు” అన్నాడు పండ్ల వ్యాపారి.

“సరే మీ దగ్గర మామిడి ఈ పండ్లకు సంబంధించినవి కాని, వేరేవి కాని కాయాలున్నాయా?” అడిగాడు పెద్దాయన

“లేవు సార్ “ అన్నాడు వ్యాపారి.

“ఉంటే చెప్పు, నేను ఇంకో పది రూపాయలు ఎక్కువైనా ఇస్తాను. ఇవి మందు తో మాగిన పండ్లు కదా” అన్నాడు.

నిజమే సార్, మీతో అబద్దమెందుకు చెప్పాలి? అవి మందు తో మాగిన పండులే. మా దగ్గర కాయలైతే లేవు సార్” అన్నాడు వ్యాపారి.

“ఎందుకంటే నేను ఆ కాయలను ఇంట్లో మాగ పెడతాను. అవి వీటి కంటే తీయగా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. అయినా మీరు కాయలు అమ్మవొచ్చు కదా ” అన్నాడు పెద్దాయన.

“సార్, చాలా మంది పండ్లు పచ్చగా ఉంటే కొంటారు. కాయలుగా ఉంటే కొనరు. పైగా మేము డబ్బు వడ్డీకి తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంటాము. మాకు వెంట వెంటనే డబ్బు రావాలి.

ఇదండీ సంగతి. ఇక విషయం అర్థమైంది కదా!

మందుతో మాగవేసిన పండ్లు తింటే ఒక పండు తింటే దాని దుష్ట ప్రభావం పైకి చూపక పోవచ్చు కాని, రెండవ పండు తింటే మాత్రం కడుపు నోప్పే.

ఇలా తయారైన పండును తోలు తో తినకూడదు. ప్రమాదకరము.

చిన్నపిల్లలు ఇష్టంగా తింటున్నారని ఎక్కువగా తినిపిస్తే కడుపు నొప్పి ఖాయం.

మనమూ ఇంట్లో మాగపెట్టిన పండులైతే, తోలుతో సహ వదలకుండగా తినడము ఆరోగ్యకరం.


ముగింపు:  ఒక వేళ, మీకు కాయలు లభ్యం కాకపోతే, జిహ్వ చాపల్యం గదా! ఏదో దొరికిన పండునే తినాలి మరి. అప్పుడు రోజుకు పండు ఒకటి మాత్రమే తినండి. దొరికాయి గదా అని, రెండు, మూడు లాగించావో, మీరు బుక్ అయిపోతారు.


Tags

How to eat mango fruit


Best mango fruit
how do you eat a mango
how to ripen mango after cut
kidney mango how to eat
how are mangoes good for you
Health fruit

Fruit for health


Tasty fruit


Mango

pd4193ah

Share
Published by
pd4193ah

Recent Posts

EPS 95 Pension latest news today

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

10 hours ago

EPS Pensioners to get pension from any bank, any branch, any where in India

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

3 days ago

EPS 95 Minimum Pension

This post is in English,Hindi and Telugu.  Translated from English to Hindi and Telugu. Please…

4 days ago

EPS 95 Pension latest news today

जावक मेल क्रमांक/ यवत समारंभ/२९२४/२०२४.        दिनांक २सितम्बर२०२४ || प्रेस नोट,यवत ,पुणे ,महाराष्ट्र…

4 days ago

EPS 95 Minimum Pension & Unified Pension System

This post is from the pen of G. Srinivas Rao. "Major Trade Unions not bothered…

6 days ago

EPS 95 Pension latest news today

"जहाँ चाह वहाँ राह। 30 अगस्त, वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी के साथ बैठक"…

7 days ago