Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
ఈమధ్య యువతి యువకులు, విద్యార్థులు, విద్యార్థినిలు చపాతీలు, పూరీలు, పుల్కాలు తెల్లగా ఉండే వాటిని ఇష్టపడుతున్నారు.
కానీ ఇది ఆరోగ్యానికి ఇబ్బందికరము.
ముఖ్యంగా “G” ప్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాయిలెట్ సరిగా పోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Maida pindi:
మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు.
Maida pindi: మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయినా సరే మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య ఇంకా అధికంగానే ఉంది. మైదాపిండి ఎలా తయారవుతుందో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు.
Maida pindi: మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్డు, బొబ్బట్లు… ఇలా ఎన్నో ఈ పిండితో తయారు అవుతాయి. మైదాపిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయినా అవి రుచిగా ఉండడంతో మైదాపిండి సీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మైదాపిండి దేనితో తయారు చేస్తారో యిప్పుడైనా ఆలోచించండి.
అది నేరుగా ఏ గింజల నుండి తయారవ్వదు.
ఉదాహరణకు రాగి పిండి కావాలనుకుంటే రాగులను మర పట్టించి రాగి పిండి తయారు చేసుకుంటాము. అలాగే బియ్యప్పిండి కావాలనిపిస్తే బియ్యాన్ని మర పట్టించి బియ్యప్పిండిని రెడీ చేసుకుంటాం. మైదాపిండి మాత్రం అలా తయారు కాదు.
దీని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఆరోగ్య ప్రమాద కారకాలను కలుస్తాయి. అందుకే మైదా పిండిని దూరంగా ఉంచమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు?
చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు. గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలపరు. కేవలం గోధుమలను మర పట్టించి పిండిని తయారు చేస్తారు.
అయితే మైదాపిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది. గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి. అందుకే మైదాపిండి తెల్లగా వస్తుంది.
గోధుమలతో తయారైన కూడా దాని రంగు తెల్లగా ఉండడానికి ఈ పాలిష్ చేయడమే కారణం.
ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మర పట్టిస్తారు. దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అజోడి కార్బోనోమైడ్, పొటాషియం బ్రోమైట్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదాపిండి చాలా మెత్తగా, తెల్లగా మారుతుంది.
మైదాపిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే పోషకాహారునిపుణులు మైదాను పూర్తిగా తినడం మానేయమని సూచిస్తున్నారు. మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు సున్నా.
కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనిలో పొటాషియం బ్రోమైట్ ను వినియోగించారు. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచవొచ్చు. నిజానికి బ్రోమేట్ పై నిషేధం కూడా ఉంది. దాన్ని తిని ఎన్నో కీటకాలు కూడా చనిపోతాయి. కాబట్టి మైదాపిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి.
మైదా వంటకాలు
మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. నిజానికి వాటిని మైదాతో చేస్తారని తెలియక చాలామంది తినేస్తూ ఉంటారు.
పరోటా,
పూరీ,
రుమాలీ రోటీ,
కేకులు,
రవ్వ దోశలు,
కాజాలు,
బాదుషాలు,
జిలేబి,
బొబ్బట్లు,
బ్రెడ్లు… ఇవన్నీ కూడా మైదాతో చేసిన వంటకాలే. వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి.
పూర్తిగా గోధుమ పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి. గోధుమ పిండితో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి.
మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే మైదా పిండిని పూర్తిగా తినడం మానేయడం ఒక్కటే ఉత్తమ మార్గం.
Source: W.A.
Thanks and credits to the contributor of this content.
ENGLISH
But it is bad for health.
Especially “G” has more chances of packing. A situation where the toilet does not flush properly occurs.
Maida pindi:
If you know how maida flour is made, you will stop eating it.
Maida pindi: Nutritionists say maida pindi is not good for health. However, the number of dishes made with maida flour is still high. If you know how maida flour is made, you will stop eating it.
Maida pindi: The number of dishes made with maida flour is not less. Many types of sweets, cakes, bread, cakes etc. are made with this flour. There are a lot of recipes that use flour and sugar together. Both of these together are very dangerous for health. However, the number of people who eat maidapindi seats is high because of their taste. Ever think what flour is made of.
It is not made directly from any seeds.
For example, if we want ragi powder, we grind ragi and make ragi powder. Also, if we want rice flour, we grind the rice and prepare the rice flour. Maidapindi is not made like that.
Its manufacturing method poses health risk factors. That is why nutrition experts say to keep maida flour away.
How is maida flour made?
Wheat is used to make the wheat flour used to make chapatis. No chemicals are added in the preparation of wheat flour. Flour is made by simply grinding wheat.
But flour is prepared in a different way. The wheat is well polished. When this polishing is done, all the upper layers on the wheat are removed. That is why flour is white.
This polishing is the reason why even wheat is white in color.
Now the highly polished wheat is milled. Chemicals like benzol peroxide, chlorine gas, azodicarbonamide, potassium bromite are added to make it whiter. Mixing all these chemicals makes the flour very soft and white.
Eating flour is not good for health. That is why nutritionists suggest to stop eating Maida completely. There are zero health benefits to the body from eating food items made from maida.
But due to the chemicals used in it, there may be some problems in the long run. Especially potassium bromite is used in this. It can increase the chance of cancer. In fact there is a ban on bromate as well. Many insects also die by eating it. Therefore, dishes made with flour should be avoided.
Maida dishes
There are many types of maida dishes in the market. Actually, many people eat them without knowing that they are made with maida.
Parotta,
Puri,
Rumali Roti,
cakes,
Rava Doshas,
cajas,
Badushas,
Jalebi,
lumps,
Breads… these are all flour dishes too. If you eat these regularly, there is a possibility of getting some kind of diseases.
Every dish made with maida can be made with wheat flour. So ban the dishes made with maida at home.
Try making it with whole wheat flour. Dishes made with wheat flour are also tasty.
If you want to protect your health and the health of your family, the only best way is to completely stop eating maida flour.
Source: W.A.
Thanks and credits to the contributor of this content.
Please press here to read another health tip
Please press here for pensioners subject if you need
Tags
Health tips
Health tips in Telugu