Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
“బద్దకస్తుల భారతం”
ఈ మధ్యన నేను ఒక 35 సంవత్సరాల వయసున్న యువకుడు, ఏ పనీ చేయకుండా,ఊరి మధ్యలో ఉన్న ఒక పాన్ షాప్ దగ్గర గుట్కా తింటూ ఎప్పుడూ అక్కడే ఉండడం గమనించి, అతనితో సంభాషించడం ఈ క్రింద విధంగా జరిగింది.
నేను: ‘ఎందుకు నీవు ఏ పనీ చేయకుండా ఇక్కడ ఇలా గుట్కా తింటూ ఉంటావు ? నీవు ఏ పనీ చేయవా ?”
అతను “అది నా ఇష్టం” అన్నాడు.
నేను: నీకు పెళ్లయ్యిందా?
అతను: అయింది.
నేను: నీకు పెళ్ళెలా అయింది?
అతను:
“ముఖ్యమంత్రి ఆదర్శ వివాహ యోజన”
(ప్రభుత్వ పథకం) ద్వారా నాకు 30,000 వచ్చాయి. అలాగే ” అంత్యోదయ కన్యా వివాహ యోజన”(ప్రభుత్వ పథకం) ద్వారా 2,50,000 వచ్చాయి.
నేను: నీ పిల్లల కోసం ఏమీ చేయవా?
అతను: “జననీ సురక్ష యోజన”(ప్రభుత్వ పథకం )ద్వారా “ఉచిత ప్రసవం” ద్వారా 1,500, “భగినీ ప్రసూతి యోజన”(ప్రభుత్వ పథకం) ద్వారా 20,000 వస్తాయి.
నేను: మరి పిల్లల చదువు ?
అతను: పిల్లలకు అన్నీ ఉచితం. విద్య,యూనిఫాం,పుస్తకాలు,భోజనం అన్నీ, *” *’ముఖ్యమంత్రి నౌల్ నిహాల్ మరియు మేధావి ఛాత్రవృతి యోజన”*(ప్రభుత్వ పథకం) ద్వారా ప్రతీ సంవత్సరం ఉచితం.
నేను: మరి, నీ ఇల్లు ఎలా గడుపుతున్నావు?
అతను: నా తమ్ముడికి ప్రభుత్వం నుండి *’ఉచితంగా ఒక సైకిల్ “* వచ్చింది. ‘నా కొడుక్కి ఒక లాప్ టాప్” వచ్చింది.నా తల్లిదండ్రులకు “వృద్ధాప్య పింఛన్లు” వస్తున్నాయి. మాకు ‘నెలంతా కిలో రూపాయి “ బియ్యం వస్తాయి.
నేను: మరి నీవు కనీసం నీ తల్లిదండ్రుల తీర్థ యాత్రలకు ఖర్చయినా పెడతావా?
అతను: “ముఖ్యమంత్రి తీర్థ యాత్రా యోజన” (ప్రభుత్వ పథకం ) పథకంలో వారిని ఎప్పుడో తీర్థ యాత్రలకు పంపించాను కదా!?
నేను: మరి కనీసం వారి ఆరోగ్యం కోసం ఖర్చు చేయవా ?
అతను: వారికి “ఆయుష్మాన్ భారత్” పథకంలో “5,00,000 ఉచితంగా ట్రీట్ మెంట్ “ వుంది కదా? మరి నేనెందుకు ఖర్చు చేస్తాను?
నేను: కనీసం, వాళ్ళు కాలం చేస్తే, అంత్య క్రియల కైనా ఖర్చు చేస్తావా?
అతను: దానికైనా ఎందుకు ఖర్చు చేయాలి? ప్రభుత్వం అంత్యక్రియల కోసం ‘ఒక రూపాయి కే ఉచిత విద్యుత్ దహనం” పథకం ఇస్తోంది కదా?
నేను; కనీసం నీ పిల్లల పెళ్లిళ్లకైనా ఖర్చు పెడతావా?
అతను: (ఒక నవ్వు నవ్వి) ఎందుకు ఖర్చు చేయాలి? నేను చేస్తున్నదే వాళ్ళు చేస్తారు. అంతే.అయినా,
“మీలాంటి లక్షలాది మంది కష్ట పడి పని చేసి పన్నులు కట్టేది మా కోసమే కదా!? రైతులు కష్ట పడి పంట పండిస్తే, దానిని ప్రభుత్వం కొని మాలాంటి వారికి ఉచితంగా ఇస్తుంటే, మేమెందుకు పని చేస్తాం?”
ఇది ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న వ్యవహారం.
Source: WA
Thanks and credits to the content creator